బెల్లంపల్లి: రైల్వేలో పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్, గూడ్స్ గాడ్స్, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. బ్రాంచ్ చైర్మన్ ఎస్.నాగరాజు, సెక్రెటరీ జి.సాంబశివుడు మాట్లాడుతూ లోకో పైలెట్లకు కిలోమీటరుకు 25శాతం అలెవెన్స్ ఇవ్వాలని, 2024 జనవరి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, రైల్వేస్టేషన్లలోని రన్నింగ్‌రూమ్‌లు మరమ్మతు చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ సీహెచ్.శంకర్‌రావు, డివిజనల్ సెక్రెటరీ పి.రవీందర్, వైస్‌చైర్మన్ వివేక్, ట్రెజరర్ షోకేస్ మీనా, లోకో పైలెట్స్, ఉమెన్ అసిస్టెంట్ లోకో పైలెట్స్ పాల్గొన్నారు.


