హోరాహోరీగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాల మైదానంలో అస్మిత అథ్లెటి క్స్ లీగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–14, 16 విభాగాల్లో జిల్లా నుంచి 200 మంది బాలికలు అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాకు పంపించనున్నట్లు అసోసియేషన్ స భ్యులు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన బాలికలకు మెమొంటోలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూవో చందన, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రం, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాంబమూర్తి, కార్యదర్శి ఈ.మారయ్య, పరిశీలకులు విద్యాసాగర్, నాగరాజు పాల్గొన్నారు.


