శిశుమందిర్ పూర్వ వైభవానికి సహకరించాలి
మందమర్రిరూరల్: పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల పూర్వ వైభవానికి అందరూ సహకరించాలని విద్యాభారతి దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం పట్టణంలోని రెండవ జోన్‌లో శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్‌లో 1972–2012 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఏరియా జీఎం రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సరస్వతి విద్యాలయాల్లో చ దవడం వలన దేశభక్తి అలవడుతుందన్నారు. అంతకుముందు పూర్వ విద్యార్థులు చిన్ననా టి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా గడిపారు. నాడు విద్యాబుద్ధులు నేర్పించి న గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, విభాగ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విష్ణువర్ధన్‌రావు, స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


