సీవోఈ ఎదుట విద్యార్థుల ఆందోళన
బెల్లంపల్లి: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులలో ఇటీవల విలీనం చేసిన సిర్పూర్(టి) విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. అక్కడ గురుకుల విద్యాలయ భవనం శిఽథిలావస్థకు చేరుకోవడంతో 9, 10 తరగతుల విద్యార్థులను బెల్లంపల్లి సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ కళాశాలకు షిఫ్ట్ చేశారు. 140 మంది విద్యార్థులు సీవోఈ గురుకులంలో ఉండి చదువుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న 600 మంది విద్యార్థులకు తోడుగా అదనంగా 140 మంది రావడంతో సౌకర్యాల స మస్య ఏర్పడింది. సిర్పూర్(టి) విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వెంటనే వసతులు ఉన్న భవనంలోకి పంపించాలని విద్యార్థులు సీవోఈ కళాశాల గేట్ తెరిచి రోడ్డెక్కారు. లగేజీ సర్దుకుని ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ప్రిన్సిపాల్ విజయసాగర్, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులతో మాట్లాడారు. సిర్పూర్(టి) గురుకుల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. తిరిగి కళాశాలలోకి వచ్చారు.


