అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల బాలుర కళాశాలలో అండర్–14, 17 జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ము న్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ క్రీడాజ్యోతి ని వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మా నసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ప్రతీ విద్యార్థి ఏదో విభాగం నుంచి పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని 12 పాఠశాలల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 8వరకు పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్సీవో శ్రీధర్, ప్రిన్సిపాల్ మంగ, ఏటీపీ తిరుమల్, వాణి, పీడీలు, పీఈటీలు ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.


