ఆశావర్కర్లకు రూ.20వేలు వేతనం చెల్లించాలి
పాతమంచిర్యాల: ఆశావర్కర్లకు ప్రభుత్వం రూ.20 వేలు చెల్లించాలని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క, కార్యదర్శి శోభ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పారామెడికల్ కళాశాలలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా సంకె రవి, అధ్యక్షురాలుగా ఎస్.సమ్మక్క, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శోభ, ఉపాధ్యక్షురాలుగా విజయలక్ష్మి, అరుంధతి, కవిత, కోశాధికారిగా పద్మ, సహాయ కార్యదర్శులుగా సునీత, సువర్ణ, ఉదయ, జిల్లా కమిటీ సభ్యులుగా అనురాధ, లక్ష్మి, భాగ్య, కవిత, రాజేశ్వరీ, పుష్ప, లావణ్య, సుజాత, నీరజ, లీలాను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్, ఆశావర్కర్లు, పట్టణ పౌరవేదిక కన్వీనర్ ప్రకాష్, జిల్లా నాయకులు దేవదాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుమాస ఆశోక్ పాల్గొన్నారు.


