ముగ్గురు ఎంపీఓలు నియామకం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాకు ము గ్గురు నూతన మండల పంచాయతీ అధికారులు(ఎంపీఓ) నియామకం అయ్యారు. గ్రూప్ –2లో ఉద్యోగాలు సాధించిన వెంకటేశ్, మహేశ్, రమ్యశ్రీని ప్రభుత్వం జిల్లాకు కేటా యించింది. గురువారం కలెక్టరేట్‌లోని డీపీఓ చాంబర్‌లో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) డి.వెంకటేశ్వర్‌రావును కలిసి జాయినింగ్ రిపోర్టులు అందజేశారు. జైపూర్ ఎంపీవో శ్రీపతి బాపు, డీపీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రజ్ఞ, వెంకటేశ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, జిల్లాలో వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల ఎంపీఓ పోస్టులు ఖాళీగా ఉండడంతోపాటు హాజీపూర్‌కు ఇంచార్జి ఉన్నా విధులకు హాజరు కాని దుస్థితి. కొత్త వారితోనైనా రెగ్యులర్ ఎంపీఓ ను కేటాయించాలని కోరుతున్నారు.


