ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జ్వరం
కోటపల్లి: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్ర మ పాఠశాలలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ గురువారం కోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. పాఠశాలలో పారిశుద్ధ్య నివారణకు చర్యలు చేపడుతున్నామని ఇన్‌చార్జి హెచ్‌ఎం మధున య్య తెలిపారు. జ్వరపీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు నెలల క్రితం ఇదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


