గూడెం ఆలయ హుండీలు లెక్కింపు
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ నెల 5రకు రూ.13,96,261 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. 9గ్రాముల బంగారం, 890 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి బి.రమేష్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం జరిగిన కార్తిక పౌర్ణమి జాతరకు రూ.18,74,710 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.


