ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్
మంచిర్యాలఅర్బన్: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్ చేపట్టారు. జిల్లాలోని డిగ్రీ, పీజీ, నర్సింగ్, డీఎడ్ కళాశాలలు బంద్‌లో పాల్గొన్నాయి. కళాశాలలు మూసివేసి అధ్యాపకులు, యజమానులు నిరసన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇచ్చేవరకు కళాశాలలు ప్రారంభించబోమని కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు ప్రకటించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ(డిగ్రీ కళాశాలల) యాజమాన్య సంఘం అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణ, ఆయా కళాశాలల చైర్మన్లు, కరస్పాండెంట్లు పల్లె భూమేష్, చంద్రమోహన్‌గౌడ్, పి.మల్లేశ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


