పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: గత మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉమ్మ డి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పీఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు అందడం లేదన్నారు. ఉమ్మడి జి ల్లాలోనే రూ.2వేల కోట్లు ఉన్నాయని, సీఎం, డిప్యూటీ సీఎంలను కలువనివ్వడం లేదని, ఇప్పటికే కాంట్రాక్టర్లు అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని అన్నారు. అసోసియేషన్ వైస్ చైర్మన్ బి.అశోక్ పటేల్, సెక్రెటరీ జి.ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ బి.సదాశివరెడ్డి, కోశాధికారి సిరాజ్ ఉల్ రహమాన్, జనరల్ కౌన్సిల్ మెంబర్ ఎం.శ్రీధర్‌రావు, ఆది హరిమోహన్‌రావు పాల్గొన్నారు.


