ఇంచార్జి డీసీవోగా సత్యనారాయణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా సహకార శాఖ అధి కారి(డీసీవో)గా ఎం. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్‌లో జిల్లా సహకార శాఖ బాధ్యతలు చేపట్టిన రాథోడ్ బిక్కు అక్టోబర్ 25న లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా డిప్యూటీ రిజిస్ట్రా ర్, ఆడిట్ ఆధికారి ఎం.సత్యనారాయణను జిల్లా ఇంచార్జిగా నియమించారు. డీసీవోను సహకార శాఖ అధికారులు అసిస్టెంటు రిజి స్ట్రార్లు, సూపరింటెండెంట్లు హన్మంత్‌రెడ్డి, రవీందర్‌రావు, రాజేశ్వరి, వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్లు మల్లారెడ్డి, ఆరాథి, సందీప్, ఏడీ ప్రసాద్, సురేందర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.


