నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గీట్ల సుమీత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల్లో దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా ఆఫీస్ సబార్డినేట్‌లుగా పనిచేస్తున్న వారు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారన్నారు. ఈ క్రమంలో ఆఫీస్ సబార్డినేటర్లకు, విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు మంజూరు చేయాలని, పీఆర్‌సీ వర్తింజేయాల ని, హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలి పారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కవితారాణి, కోశాధికారి సుజాత, సభ్యులు శేఖర్, అంకూస్, సతీశ్, సునీత, తారాబాయి, శ్రీనివాస్, గోవర్దన్, తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
