విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నెన్నెల: వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గూర్చి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. పరిశుభ్రత పాటించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సిబ్బందికి సూచించారు. వంటగది, భోజనశాల, స్టోర్‌రూమ్ హాస్టల్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు ట్యూటర్లను నియమించాలని వార్డెన్ జయశంకర్‌ను ఆదేశించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
