సత్ఫలితాలనిస్తున్న గడ్డిక్షేత్రాలు
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్‌లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డిక్షేత్రాలు సత్ఫలితాలిస్తోంది. గతంతో పోలిస్తే వీటి వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగాయి. అటవీప్రాంతంలో గడ్డి క్షేత్రాలు విస్తరించి ఉంటే శాకాహార జంతువుల సంతతి పెరుగుతుందనే ఆ శాఖ అధికారులు 2019లో వీటి పెంపకానికి శ్రీకారం చుట్టారు. దీంతో పులుల రాక కోసం అటవీ అధికారులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి ఆహారంగా అడవిలో నివాసం ఉండే శాకాహార జంతువుల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం వరకు జన్నారం అటవీ డివిజన్‌లో సుమారు వెయ్యి హెక్టర్లలో గడ్డి మైదానాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మరో 80 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గడ్డి విత్తనాలు చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సహజసిద్ధంగా మొలసిన గడ్డిలో కలుపు తొలగిస్తూ పెంపకం చేస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే పశువులు తినకుండా సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు.
కేరాఫ్‌గా జన్నారం డివిజన్
జన్నారం అటవీ డివిజన్‌లో అత్యధికంగా గడ్డి మైదానాలున్నాయి. వీటికి కేరాఫ్‌గా చెప్పువచ్చు. ఈ అటవి డివిజన్ పులి అవాసాలకు అనువుగా ఉండటం వల్ల గడ్డిపెంపకంపై దృష్టి సారిస్తున్నారు. దీనికితోడు శాకాహార జంతువులు జింకలు, దుప్పులు, నీలుగాయిలు, సాంబ ర్లు, కుందేళ్లు, గడ్డి, కృష్ణ జింకలు అవాసాలు ఏ ర్పాటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే గడ్డిక్షేత్రాలతో వన్యప్రాణుల సంఖ్య పెరిగినట్లు అఽ దికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో స హజసిద్ధంగా గడ్డి వస్తుంటుంది. గత సంవత్సరంలో ఎండిన గడ్డి విత్తనాలు మొలకెత్తుతా యి. ఆయా ప్రాంతంలో గడ్డి క్షేత్రాలు పరిశీలించడం, కలుపు తీయించడం, జరుగుతుంది. దీంతో కలుపు లేని గడ్డిని వన్యప్రాణులు ఇష్టంగా తింటాయని అధికారులు పేర్కొంటున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
