16న కుంగుఫూ చాంపియన్‌షిప్ పోటీలు
నస్పూర్: నస్పూర్‌లో వి కరాటే అండ్ ఫిట్నెస్ అకాడమీ మంచిర్యాల ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ స్మారకార్థం ఈనెల 16న రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే కుంగు ఫూ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది ఎండీ సంధాని తెలిపారు. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన పోటీల నిర్వాహకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధాని మాట్లాడుతూ నస్పూర్ కాలనీలోని గోదావరి ఫంక్షన్ హాల్‌లో ఈ పోటీలు ఉంటాయన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ స్మారకార్థం నిర్వహించే పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో నిర్వాహకులు వెంకటేశ్, శ్రీనివాస్, మహేశ్, రమేశ్, ఎండీ అబ్బాస్, ఎండీ మయూబ్, విజయ్, నరెడ్ల శ్రీనివాస్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
