రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) బాలుర గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గురుకులంలో 8వ తరగతి చదువుతున్న బి.ఉషాకిరణ్ ఇటీవల కాగజ్‌నగర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా జోనల్‌స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 3 నుంచి 5వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. సదరు విద్యార్థిని సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. సీవోఈ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు సీ.హెచ్.రాజశేఖర్, అల్లూరి వామన్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
