ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
నిర్మల్‌టౌన్: ఆర్యవైశ్యులు పార్టీలకతీతంగా రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఆమెడ శ్రీధర్, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండేళ్ల పదవీ కాలంలో ఆర్యవైశ్యులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మల్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి రూ.25 లక్షల నిధుల విడుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్‌చార్జిగా పట్టణానికి చెందిన పత్తి విజ్ఞతేజ నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ చైర్మన్ మిరుదొడ్డి శ్యామ్, వైస్ చైర్మన్ యాద నాగేశ్వర్‌రావు, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గాదె విలాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సాగు చేసిన
రైతుపై కేసు
ఇంద్రవెల్లి: చేనులో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పాటగూడ గ్రామానికి చెందిన కుమ్ర భీంరావ్.. ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న, కంది, పత్తి పంటలు, అంతర పంటగా 20 గంజాయి మొక్కలు సాగు చేశాడు. పక్కా సమాచారం మేరకు ఆదివారం భీంరావ్ చేనులో తనిఖీ చేయగా 20 గంజాయి మొక్కలు లభ్యం కాగా, వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు.
కలప స్మగ్లింగ్ నిందితుడికి
14 రోజుల రిమాండ్
ఖానాపూర్: కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలో కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన ఎంబడి శేఖర్‌కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిర్మల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాసు మె జిస్ట్రేట్, ఖానాపూర్ ఇన్‌చార్జి భవిష్య తెలి పారు. నిందితుడిని రాత్రి నిర్మల్ సబ్‌జైల్‌కు తరలించినట్లు ఎఫ్‌డీవో శివకుమార్, ఎఫ్‌ఆర్‌వో అనిత పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకుంటామన్నారు.
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని రోటిగూడ గ్రామంలో ఆదివారం సాయంత్రం తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు, ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పాలాజీ సుధాకర్, భాస్కర్ ఇళ్లలో రెండు కర్ర కోత యంత్రాలు, కలపను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వీటి విలువ రూ. 24,500 ఉంటుందన్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. తాళ్లపేట డీఆర్వోలు సాగరిక, పోచమల్లు, ఎఫ్‌ఎస్‌వోలు శంకర్, నరేశ్, బీట్ అధికారులు రహీమోద్దీన్, సాయ రవికిరణ్, అనిత, జ్యోతి, కృష్ణమూర్తి, రుబీనా, వెంకటేశ్, లవన్ ఉన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
