సామాజికసేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

సామాజికసేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర

Nov 3 2025 6:22 AM | Updated on Nov 3 2025 6:22 AM

సామాజ

సామాజికసేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర

● తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ్‌ గణేశ్‌

ఆదిలాబాద్‌: సామాజిక సేవలు ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ్‌ బలవత్రి గణేశ్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకలు భాగంగా జిల్లాకేంద్రంలోని డైట్‌ కళాశాల మైదానంలో ఆదివారం పథ సంచలన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథ సంచలన్‌ జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌక్‌ల గుండా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్‌ అన్నివర్గాలకు విపత్కర సమయాల్లో అండగా నిలుస్తోందన్నారు. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చిన సంఘ్‌ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ సంచలన్‌లో ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఇందూర్‌ విభాగ్‌ సంఘ్‌ చాలక్‌ నిమ్మల ప్రతాపరెడ్డి, నగర సంఘ్‌ చాలక్‌ నూతుల కల్యాణ్‌రెడ్డి పాల్గొన్నారు.

సామాజికసేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర1
1/1

సామాజికసేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకపాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement