మొలకెత్తిన దూది
చెన్నూర్‌రూరల్: జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. పంటలు చేతికి వచ్చే మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురవడంతో పత్తి, వరి చేలు దెబ్బతిన్నాయి. ఏరే దశలో ఉన్న పత్తి తడిసిపోయింది. చెన్నూర్ మండలం కాంబోజిపేట గ్రామానికి చెందిన యువరైతు పెండ్లి సంతోష్ గ్రామ సమీపంలోనే ఎకరానికి రూ.15వేలు కౌలు చెల్లించి మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఇప్పటివరకు పత్తి పంట సాగుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు చేశాడు. మొక్కలకు ఉన్న పత్తి కాయల నుంచి పత్తి బయటకు వచ్చింది. కురిసిన వర్షాలకు ఇలా బయటకు వచ్చిన పత్తి మొత్తం తడిసి పోయి గింజలోంచి మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు.
							మొలకెత్తిన దూది

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
