వృత్తి రక్షణకు పార్టీలకతీతంగా ఏకం కావాలి | - | Sakshi
Sakshi News home page

వృత్తి రక్షణకు పార్టీలకతీతంగా ఏకం కావాలి

Nov 3 2025 6:22 AM | Updated on Nov 3 2025 6:22 AM

వృత్తి రక్షణకు పార్టీలకతీతంగా ఏకం కావాలి

వృత్తి రక్షణకు పార్టీలకతీతంగా ఏకం కావాలి

● మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు నర్సాగౌడ్‌

భైంసాటౌన్‌: గ్రామాల్లో కల్లుగీత కార్మికులపై వీడీసీ వేధింపులు ఎక్కువయ్యాయని, వృత్తి రక్షణకు గౌడ కులస్తులు పార్టీలకతీతంగా ఏకం కావాలని మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ అమరవేణి నర్సాగౌడ్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి గౌడ సంఘ భవనంలో నక్కల మోహన్‌గౌడ్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మోకుదెబ్బ జిల్లా ముఖ్యుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు జిల్లా అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కనక గౌడ్‌(కుభీర్‌), ముష్కం అశోక్‌ గౌడ్‌(భైంసా)ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రక్షణ, గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ కృషి చేస్తోందన్నారు. వీడీసీల నిలువు దోపిడీపై రాజకీయాలకతీతకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చార ు. కుల దామాషా ప్రకారం అన్ని రంగాల్లో గౌడ కులస్తుల వాటా సాధన కోసం మోకుదెబ్బ పని చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి 5 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మురళిగౌడ్‌, కార్యవర్గ సభ్యులు రాజేందర్‌గౌడ్‌, వెంకట్‌గౌడ్‌, దశాగౌడ్‌, జిల్లాలోని అన్ని మండలాల గౌడ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement