మహిళ మెడలో గొలుసు చోరీ
నస్పూర్: పట్టపగలే ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కు ని ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ పరిధిలోని రాయల్ గార్డెన్ సమీపంలోని గణేశ్‌నగర్‌కు చెందిన చేవెళ్ల సరస్వతి.. ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం ఆమె పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించింది. ఆ తర్వాత తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి సరస్వతి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌కుమార్, ఎస్సై ఉపేందర్‌రావు ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆలయంలో చోరీ
ముధోల్: కారేగాం గ్రామంలోని శనివారం రాత్రి ఎ ల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం, వెండి కన్నులతోపాటు భక్తులు సమర్పించిన కానుకలు, రూ.2 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. తాళం పగులగొట్టిన హుండీ తెరుచుకోకపోవడంతో అక్కడే వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
