రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పతకాల పంట
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్‌ఐ అండర్–17 బాల,బాలికల జూడో పోటీల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో ఈనెల 1, 2 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 12 పతకాలతో మెరిశారు. బాలికల్లో డి.నాగిని ప్రియ (–44 కేజీలు), పి.అక్షిత (–57), జి. సహస్ర (–48) లు స్వర్ణ పతకాలతో ప్రతిభ కనబరర్చారు. టి.సింధు (–52 కేజీలు) రజత పతకంతో మెరవగా, ప్రణీత(–63), బి.శృతి (–36)లు కాంస్య పతకాలతో సత్తా చాటారు. బాలురలో ఎస్.మనోజ్ కుమార్ (–40 కేజీలు), ఆర్.తరుణ్ (–55), ఎం.హర్షవర్ధన్(–60), ఆర్.మధు(–81), ఏ.సంతోష్ (–90)లు స్వర్ణ పతకాలు సాధించారు. పి.లోకేష్ (–66 కేజీల) ఈవెంట్‌లో రజత పతకం సాధించినట్లు కోచ్ రాజు తెలిపారు. డీవైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్, క్రీడా పాఠశాల సిబ్బంది, శిక్షకులు తదితరులు వారికి అభినందనలు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
