సోయా టోకెన్ల కోసం బారులు
ముధోల్:మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం నుంచి సోయా టోకెన్ల పంపిణీ చేయనున్నారు. ఆదివారం రాత్రి రైతులు తరలివచ్చి కార్యాలయం వద్ద బారులు తీరారు. క్యూలో చెప్పులు, వాటర్ బాటిళ్లు ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్సై బిట్లా పెర్సిస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉదయం కార్యాలయానికి రావాలని కోరిన వారు అక్కడే ఉండిపోయారు. సోమవారం ముధోల్, ముద్గల్, విఠోలి, మచ్కల్, తరోడా గ్రామాలు, మంగళవారం రాంటెక్, టాక్లీ, దోడాపూర్, లబి గ్రామాలకు టోకెన్లు జారీ చేయనున్నారు.
క్యూలైన్‌లో చెప్పులు ఉంచిన రైతులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
