15న ప్రత్యేక లోక్ అదాలత్
మంచిర్యాలక్రైం: ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులతో ప్రత్యేక లోక్ అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బ్యాంకు రికవరీ, సివిల్, మోటార్ వెహికిల్ యాక్ట్ తదితర కేసులు పరిష్కరించాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, అదనపు సినియర్ సివిల్ జడ్జి డీ.రామ్మోహన్‌రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్, న్యాయవాదులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
