రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
మందమర్రిరూరల్: రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని డీసీపీ భాస్కర్ అన్నారు. శనివారం పట్టణంలోని జీఎం కార్యాలయ సమీపంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదా ల్లో 17 మంది చనిపోగా అందులో యాపల్, అంగడిబజార్ ప్రాంతాలకు చెందిన వారు ఏడుగురు ఉన్నారని తెలిపారు. ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్‌రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రంజిత్, మందమర్రి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, నేషనల్ రోడ్డు అథారిటీ అధికారులు, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు అబ్బాస్, గణేష్, నర్సయ్య పాష, రాజేశ్వరి పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
