
అట్టహాసంగా చెస్ పోటీలు
తాండూర్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాల, బాలి కలకు జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు మండలంలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు పాఠశాల కరస్పాండెంట్ సురభి శరత్‌కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించి పోటీలను ప్రారంభించారు. ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి ఇదే ప్రాంగణంలో త్వరలో నిర్వహించే జోనల్‌స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమీ డైరెక్టర్ సౌమ్య, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి యాకూబ్, పాఠశాల ప్రిన్సిపాల్ సరోజని, చెస్ ఆర్‌బీటర్స్ సమ్మయ్య, ఆకాశ్, కార్తీక్, పరిశీలకులు పాశం శ్రీనివాస్, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శులు బాలకృష్ణ, రాజు, తారకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.