
కోలిండియా పోటీల్లో సత్తా
బెల్లంపల్లి/మందమర్రిరూరల్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన కోలిండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో సింగరేణి కార్మికులు సత్తాచాటారు. 75 కిలోల విభాగంలో ఈపీ ఆపరేటర్లు జనగామ మొగిలి రజత పతకం, పెసరి అర్జున్ కాంస్య పతకం, మందమర్రి ఏరియా వర్క్‌షాప్‌లో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న బత్తుల వెంకటస్వామి 85–90 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. పతకాలు సాధించిన కార్మికులను శనివారం సింగరేణి అధికారులు, బెల్లంపల్లి స్కైజిమ్ నిర్వాహకులు, సీనియర్ క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించారు.

కోలిండియా పోటీల్లో సత్తా

కోలిండియా పోటీల్లో సత్తా

కోలిండియా పోటీల్లో సత్తా