
సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించిన అంతర్‌జిల్లా బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాలలోని మిమ్స్‌లో బీకాం తృతీయ సంవత్స రం చదువుతున్న విద్యార్థిని అశ్విత పాల్గొని ప్రతిభ కనబర్చింది. నవంబర్ 21 నుంచి 23 వరకు బెంగళూర్‌లో జరిగే సౌత్‌జోన్ టోర్నమెంట్‌లో యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్య వహరించనుంది. శనివారం కళా శాలలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్‌రెడ్డి, శ్రీధర్‌రావు అభినందించారు.