
కన్నతండ్రినే కడతేర్చాడు..
జన్నారం: మద్యానికి బాని సైన కుమారుడు కన్నతండ్రినే కర్రతో కొట్టిచంపిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామ పంచాయతీలోని సేవదాస్‌నగర్‌కు చెందిన జాదవ్ శంకర్‌నాయక్ (60)కు ముగ్గురు కూతుర్లు, కుమారుడు సంతానం. నలుగురికి పెళ్లిళ్లు చేశాడు. శంకర్‌నాయక్ భార్య రేణుకాబాయి రెండేళ్ల క్యాన్సర్‌తో మృతి చెందింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమారుడు నూర్‌సింగ్ నాయక్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుండడంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఉంటున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. పలుమార్లు గొడ్డలితో చంపుతానని వెంటపడగా శంకర్‌నాయక్ తప్పించుకున్నాడు. ఈనెల 17న కూడా గొడ్డలితో చంపుతానని వెంటపడగా స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి నూర్‌సింగ్‌ను బెదిరించి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చి రొట్టెలు చేస్తున్న తండ్రిని కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. కాలనీవాసులు నిలదీయడంతో పరారయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించారు. మృతుని చిన్న కూతురు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

కన్నతండ్రినే కడతేర్చాడు..