
‘లంబాడాలు ఐకమత్యంగా ఉండాలి’
పాతమంచిర్యాల: లంబాడా జాతి బిడ్డలు తమ సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా ముందుకు సాగాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నార్త్‌ఇన్ హోటల్‌లో లంబాడా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజా రా, సుగాలి, ఎరుకల కులాల వారిపై ఆదివా సీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం(ఏఐబీఎస్‌ఎస్) అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్, నాయకులు ఆత్మారావు, బూక్యా రవినాయక్, ధరావత్ పంతుల నాయక్, ఏఐబీఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సపాట్ శంకర్ పాల్గొన్నారు.