
వేధింపుల వల్లే మధుకర్ ఆత్మహత్య
వేమనపల్లి: కాంగ్రెస్ నార్టీ నాయకుల వేధింపుల వల్లే మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం ఆయన నీల్వాయి గ్రామానికి వచ్చి మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగి తొమ్మిది రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుమాధవ్‌రావ్, నాయకులు పురాణం లక్ష్మికాంత్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశం, ఆర్.లక్ష్మినారాయణ, హమీద్‌ఖాన్, కొండగొర్ల భాపు, పక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో నాలు గు రోజుల క్రితం అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తెలిసిన వారు 8712656541, 8712658667 నంబర్‌లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
మద్యానికి బానిసై ఆత్మహత్య
జైనథ్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకు న్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని లక్ష్యంపూర్‌కు చెందిన కార్ల శంకర్ (35) భార్య లక్ష్మి నాలుగు నెలల క్రితం ఆత్మహ త్య చేసుకుంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం తండ్రి విట్టల్ తలుపు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాధలయ్యారు.