
అక్రమ కేసులు ఎత్తివేయాలి
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పలువురు డిమాండ్ చేశారు. నిజాలను వెలికితీస్తుండడాన్ని జీర్ణించుకోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
నిజాలను జీర్ణించుకోలేకనే..
బెల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో పత్రికలను గౌరవించాల్సిన కనీస బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉంది. ప్రజాసమస్యలు, వ్యతిరేక విధానాలపై పత్రికల్లో వార్తాకథనాలు రావడం సర్వసాధారణం. వాటిని ధ్రువీకరించుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధింపులకు గురిచేయడం, అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. ఆ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తన విధానాలను బేషరతుగా మార్చుకోవాలి.
– బొల్లం పూర్ణిమ, సీపీఐ రాష్ట్రసమితి
సభ్యురాలు, బెల్లంపల్లి
కూటమి ప్రభుత్వం దుర్మార్గం
బెల్లంపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తీవ్ర దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తమ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలికి తీస్తోందనే అక్కసుతో సాక్షి దినపత్రికను టార్గెట్ చేయడం, టీవీ ప్రసారాలను నిలుపుదల చేయించడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఏకంగా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని విచారణ పేరుతో సాక్షి కార్యాయలానికి వెళ్లి పోలీసులు గంటలకొద్దీ అప్రజాస్వామికంగా వ్యవహరించడం చేస్తున్నారు. ఈ తీరు ఏమాత్రం మంచిదికాదు. ప్రభుత్వం పద్ధతులు మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
– ఏ.బాపు, బీకేఎంయూ జాతీయసమితి సభ్యుడు, బెల్లంపల్లి
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
చెన్నూర్: నిజాలను నిర్భయంగా ప్రజలకు చేరవేసే పత్రికలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాగాలేదు. ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేస్తే వార్తలు రాసిన సాక్షి సిబ్బందిపై కేసులు పెట్టడం దారుణం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. సాక్షి కార్యాలయాలపై పోలీసుల దాడులు, ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు నిలిపివేయాలి.
– చకినారపు మల్లేశ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, చెన్నూర్

అక్రమ కేసులు ఎత్తివేయాలి

అక్రమ కేసులు ఎత్తివేయాలి

అక్రమ కేసులు ఎత్తివేయాలి