మంచిర్యాలఅర్బన్: అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’పై ఆంధప్రదేశ్ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. అక్రమ కేసులతో ఎడిటర్ ధనంజయరెడ్డిని, పాత్రికేయులను వేధింపులకు గురిచేయడం తగదని పేర్కొన్నారు. ప్రజల పక్షంగా నిలుస్తున్న పత్రికపై కుట్ర కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేసులు ఎత్తివేయాలి
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. సమాజంలో జరిగే ప్రతీ అంశాన్ని ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి వారధిగా నిలుసున్న జర్నలిస్టుపై అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.
– సన్నీగౌడ్, అఖిల భారత విద్యార్థి బ్లాక్(ఏఐఎస్‌బీ) జిల్లా కార్యదర్శి
పనికిమాలిన చర్య
ప్రజలకు వారధిగా ఉన్నటువంటి పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేసి బంధించడం పనికిమాలిన చర్య. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. పాత్రికేయులకు పత్రిక స్వేచ్ఛ కల్పించాలి. పదే పదే నోటీసులు ఇవ్వడం, వేధింపులకు గురిచేయడం సరికాదు.
– శ్రీకాంత్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నిర్బంధ చర్యలు సరికాదు
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, విచారణ పేరుతో సాగుతున్న నిర్బంధ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణం, పాత్రికేయులు నిజాలను వెలుగులోకి తేవడమే వారి కర్తవ్యం. అలాంటి బాధ్యతాయుత పాత్రికేయులపై రాజకీయ ప్రతీకారభావంతో ప్రభుత్వం కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఈ చర్యలను తక్షణం ఉపసంహరించుకుని పాత్రికేయుల భద్రత, గౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యూఎస్‌ఎఫ్‌ఐ పాత్రికేయుల పక్షాన నిలబడుతుంది. – మిట్టపల్లి తిరుపతి, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
వేధించడం అప్రజాస్వామికం..
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్షకడుతూ వేధించడం అప్రజాస్వామికం. పత్రిక స్వేచ్ఛను హరించేలా చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. సాక్షి పత్రికపై పదేపదే తప్పడు కేసులు పెడుతూ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవాలను ప్రజలకు చేరువ చేసే ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. సాక్షిపై కేసులు వెంటనే ఎత్తివేయాలి.
– గుమ్ముల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
నిజాలు నిగ్గుతేల్చే ‘సాక్షి’పై కేసులా..?
నిజాలు నిగ్గుతేల్చే ‘సాక్షి’పై కేసులా..?
నిజాలు నిగ్గుతేల్చే ‘సాక్షి’పై కేసులా..?
నిజాలు నిగ్గుతేల్చే ‘సాక్షి’పై కేసులా..?