
పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యం
● ఏఐసీసీ పరిశీలకులు నరేశ్‌కుమార్
బెల్లంపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ఇంచార్జి నరేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కన్నాల శివారు ఆర్పీ గార్డెన్స్‌లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ కారుకూరి రాంచందర్, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు తదితరులు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, పీసీసీ ఆర్గనైజర్లు అడువల జ్యోతి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, పులి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, బెల్లంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు మల్లేష్, రమేష్, మహేందర్, రవీందర్‌రెడ్డి, మల్లయ్య, మురళీధర్‌రావు, దుర్గాభవాని పాల్గొన్నారు.