
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరి ధిలోని గద్దెరాగిడిలో బుధవారం రాత్రి జరిగిన రో డ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భీ మా సుధాకర్ (65) మృతి చెందాడు. గద్దెరాగిడిలో ని ఓ కిరాణ దుకాణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో వేగంగా ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వెంటనే మంచి ర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. మృతుని కి భార్య, ఇద్దరు కుమారులు న్నారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.