కడెం ప్రాజెక్ట్‌ గేటు ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

కడెం ప్రాజెక్ట్‌ గేటు ఎత్తివేత

Oct 17 2025 6:24 AM | Updated on Oct 17 2025 6:24 AM

కడెం

కడెం ప్రాజెక్ట్‌ గేటు ఎత్తివేత

కడెం: కడెం ప్రాజెక్ట్‌కు గురువారం రాత్రి 1000 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో రావడంతో ఇరిగేషన్‌ అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,178 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు వెల్లడించారు.

నిజాయతీ చాటుకున్న సాయితేజ

లోకేశ్వరం: మండలంలోని పుస్పూర్‌ గ్రామానికి చెందిన గొడిసెల సాయితేజగౌడ్‌ దొరికిన బ్యాగును లోకేశ్వరం పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. బుధవారం నిజా మాబాద్‌ నుంచి పుస్పూర్‌కు బైక్‌పై వస్తున్న సాయితేజకు నందిపేట్‌ మండలం పలుగుగుట్ట సమీపంలో ఓ హ్యాండ్‌బ్యాగు దొరికింది. అందులో సెల్‌ఫోన్‌, రెండు గ్రాముల బంగా రం, ఆధార్‌ కార్డు ఉంది. ఆధార్‌ ఆధారంగా నందిపేట్‌ మండల కేంద్రానికి చెందిన ప్రవళికగా గుర్తించి లోకేశ్వరం పోలీసులకు బ్యాగ్‌ను అప్పగించాడు. సుమారు రూ.40 వేల విలువైన వస్తువులను అప్పగించిన యువకుడిని పోలీసులు అభినందించారు. గురువారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బ్యాగును అప్పగించారు.

డబ్బులు దండుకున్న

మధ్యవర్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చూస్తానని, పెద్దల సమక్షంలో సెటిల్‌మెంట్‌ చేస్తానని డబ్బులు వసూలు చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కె.నాగరాజు తెలిపారు. హైకోర్టులో జడ్జీలు, న్యాయవాదులు పరిచయం ఉన్నారని నమ్మబలికి బాధితుల నుంచి రూ.3 లక్షల 50వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఫిర్యాదుదారు కుమారుడు, కోడలు మధ్య గొడవలు ఉన్నాయి. మధ్యవర్తిగా పరిచయం ఉన్న జైనూర్‌ మండలంలోని బూసిమెట్టకు చెందిన జాడే రవీందర్‌ బాధితులను నమ్మబలికి అందినకాడికి దండుకున్నా డు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. మొదట రూ.3లక్షలు ఇవ్వగా ఆ త ర్వాత కేసు నమోదు చేయిస్తానని బెదిరించి మ రో రూ.50 వేలు తీసుకున్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో బాధితురా లు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

42 కిలోల గంజాయి దహనం

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో నమోదైన 18 కేసుల్లో పట్టుబడిన 42 కిలోల గంజాయిని గంజాయి డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలోని శ్రీ మెడికేర్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో గురువారం గంజాయి డిస్పోజల్‌ చేశారు. ఇందులో 22 కిలోల గంజాయి మొక్కలు, 20 కిలోల ఎండు గంజాయిని దహనం చేశారు. అడిషనల్‌ ఎస్పీ సు రేందర్‌ రావు, డీసీఆర్‌బీ సీఐ హకీమ్‌ ఈ ప్రక్రియను పరిశీలించారు.

కడెం ప్రాజెక్ట్‌ గేటు ఎత్తివేత1
1/1

కడెం ప్రాజెక్ట్‌ గేటు ఎత్తివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement