
స్వగ్రామం చేరిన మృతదేహం
క్లుప్తంగా
నర్సాపూర్(జి): ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం దుబా య్ వెళ్లిన మండలంలోని తిమ్మాపూర్ (జి) గ్రా మానికి చెందిన గోపు భూ మయ్య (42) నెల రోజు ల క్రితం గుండెపోటుతో మృతి చెందగా గురువా రం మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామానికి చెందిన గోపు భూమయ్య దుబాయ్‌లోని సోనా పూర్ ప్రాంతంలో గల సీఆర్‌సీ కంపెనీలో ఏడాదిన్నరగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రి తం గుండెపోటుతో మృతి చెందగా యూఏఈ హె ల్పింగ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో బొమ్మ ప్రవీ ణ్, బొడ్డుపల్లి రాము, గన్నారపు హన్మాండ్లు, శ్రీనివాస్ కంపెనీ యాజమాన్యం, పీఆర్వోలతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే ఏర్పా ట్లు చేశారు. గురువారం స్వగ్రామానికి మృతదేహం చేరడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ఇచ్చోడ: మండలంలోని అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకు తరలిస్తున్న మూడు ట్రా క్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలించి మండల కేంద్రంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అధికారి పుండలిక్ రెండు రోజుల క్రితం ట్రాక్టర్‌ను పట్టుకోగా గురువారం టైగర్‌జోన్ అధికారులు మరో మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ మేరకే కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు.
బాలిక అదృశ్యం
ఆదిలాబాద్‌టౌన్: తలమడుగు మండలంలోని దహెగాంలో అత్తాగారి ఊర్లో నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కూతురు అదృశ్యమైనట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 13న భార్యభర్తలు కూలీ పనులకు వెళ్లగా కూతురు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తలమడుగు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు వివరించారు.
కాసిపేట గని ఎదుట
ఖాళీ బిందెలతో నిరసన
కాసిపేట: నీటిసమస్య పరిష్కరించాలని డిమా ండ్ చేస్తూ మండల బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరి యా కాసిపేట గని ఎదుట గురువారం మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలి పారు. మండలంలోని ముత్యంపల్లి, చిన్నధర్మారం, కాసిపేట గ్రామాల్లో నీటి సమస్య తీవ్ర ంగా ఉందన్నారు. అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, నిధుల కొరత అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు మేనేజర్ నిఖిల్ అయ్యర్ మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బాకీ కిరణ్, ప్రనన్న, మహిళలు పోసు, లచ్చక్క, కవిత, పద్మ, మహేశ్వరి, లక్ష్మి, యువకులు పాల్గొన్నారు.

స్వగ్రామం చేరిన మృతదేహం