లక్ష్మీదేవర ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీదేవర ఆలయంలో చోరీ

Oct 17 2025 6:24 AM | Updated on Oct 17 2025 6:24 AM

లక్ష్మీదేవర ఆలయంలో చోరీ

లక్ష్మీదేవర ఆలయంలో చోరీ

భీమారం: మండల కేంద్రంలోని లక్ష్మీదేవర ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ముది రాజ్‌ సంఘం పెద్దలు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి.. సమీపంలోని పత్తి చేను మీదుగావచ్చిన దుండగులు మొదట ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హుండీలో ఉన్న 4 కిలో ల 500గ్రాములు వెండి, రూ. 36 వేల నగదు, అ మ్మవారిపై ఉన్న రెండు తులాల బంగారు అభరణా లను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇంత పెద్దఎ త్తున వెండి ఉందన్న సమాచారం దొంగలకు ఎలా చేరిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మందు పార్టీ చేసుకుని దోపిడీ

చోరీకి పాల్పడిన దొంగలు మొదట సమీపంలోని పత్తి చేనులో మందు పార్టీ చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పథకం ప్రకారం మొదట ఆలయ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయం ఎదుటే నివాస గృహాలు ఉన్నప్పటికీ దుండగులు దోచుకుని యథేచ్ఛగా వెళ్లి పోవడం వెనుక స్థానికులు ఎవరైనా వారికి సహకరించారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

500 మీటర్ల దూరంలోనే పోలీస్‌స్టేషన్‌

పోలీస్‌స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే చోరీ, జాతీయ రహదారికి సమీపంలోనే చోరీ జరగడం మండలంలో సంచలనంగా మారింది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ

సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌ గురువారం సందర్శించి స్థానికులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. డాగ్‌స్వ్వాడ్‌తో పరిసరాలు గా లించగా అది పత్తిచేనులోకి వెళ్లి ఆగిపోయింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement