
భార్యను కడతేర్చిన భర్త
గుడిహత్నూర్: మద్యం తాగొద్దని మందలించిన భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సీతాగోంది గ్రామానికి చెందిన సిడాం సంతోష్, లక్ష్మీబాయి (35) దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంతోష్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవా డు. గురువారం ఉదయం సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తాగి మోటార్ సైకిల్ నడుపొద్దని లక్ష్మీబాయి మందలించింది. మద్యం మత్తులో ఉన్న సంతోష్ కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె చెంప భాగంలో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. సీఐ బండారి రాజు, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.