
టెంబుర్నిలో అరుదైన విగ్రహాలు
నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన చారిత్రక గ్రామం టెంబుర్నిలో 12వ శతాబ్దపు ఉగ్ర నారసింహుడు, విష్ణుమూర్తి, సరస్వతిదేవి, నృత్య గణపతి, ద్వార పాలకుడు విగ్రహాలు లభ్యమైనట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావ్ తెలి పారు. రెండు దశబ్దాల క్రితం పనికి ఆహార పథకంలో భాగంగా తవ్వకాలు చేస్తున్నప్పుడు అరుదైన వి గ్రహాలు బయటపడ్డాయని తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం శివకేశవులకు భే దం లేదన్న సందేశం ఇస్తుందని పేర్కొన్నారు. ఇ క్కడ ప్రధాన ఆలయం శ్రీచక్ర లింగం కలిగిన శివా లయమే అయినా స్తంభాలకు అరుదైన శిల్ప ప్రతి మలు చెక్కినారని వివరించారు. చామరధారిణి వి గ్రహాలు, ద్వారపాలకుల సుందర విగ్రహాలతో పాటు విలక్షణమైన సరస్వతిదేవి ప్రతిమ, ఉగ్రనారసింహుడు, నృత్య గణపతి, విష్ణుమూర్తి ప్రతిమలు స్తంభా లకు మలిచారని తెలిపారు. ఆలయ పీఠ స్తంభాలు చెల్లాచెదురుగా పడి ఉండడం వల్ల ఆ లయం విధ్వంసానికి గురైనట్లు తెలిపారు. ఈ ప్రాంత పరిసరాలను పరిశీలిస్తే శాతవాహన, కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలంలో గొప్ప నాగరికత విలసిల్లినట్లు తెలుస్తుందన్నారు. పురావస్తు శాఖ ప్రత్యేక దృష్టి సారించి వీటిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి, మానస సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

టెంబుర్నిలో అరుదైన విగ్రహాలు