
టీఎన్జీవోస్ సొసైటీ భూముల క్రయవిక్రయాలు చెల్లవు
మంచిర్యాలటౌన్: నస్పూరులోని సర్వేనంబర్ 42లో ఇంటి స్థలాలను టీఎన్జీవోస్ సొసైటీకి కేటాయించారని, ఇతర వ్యక్తులకు ఆయా స్థలాలను అమ్మడం, కొనడం చేయవద్దని టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సమావేశం బుధవారం తీర్మానం చేసింది. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులు మాట్లాడారు. సొసైటీకి సంబంధం లేని వ్యక్తులు స్థలాలు తమవేనని అమ్మకాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు మోసపోవద్దని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి మహ్మద్ హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు సైండ్ల మొండయ్య, సంయుక్త కార్యదర్శి భూముల రామ్మోహన్, కోశాధికారి దొరిశెట్టి రాజమౌళి, కార్యవర్గ సభ్యులు నాగుల గోపాల్, బేతు కళావతి, ఆర్‌డీ.ప్రసాద్, సయ్యద్ ఇంతియాజ్ పాల్గొన్నారు.