
గాలికుంటు నివారణపై అపోహలొద్దు
దండేపల్లి: పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై పశు పోషకులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పశువైద్యాధి కారి శంకర్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో బుధవారం ఉచిత మెగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలు పైబడిన గోజాతి, గేదెజాతి పశువులకు టీకాలు తప్పక వేయించాలన్నారు. గ్రామంలో 280 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యాకుబ్‌రెడ్డి, దండేపల్లి, లక్సెట్టిపేట పశువైద్యులు ధన్‌రాజ్, భూమన్న, సుజాత, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజన్న, రాకేష్ పాల్గొన్నారు.