
‘బొర్లకుంట’ వర్సెస్ ‘గోమాసే’
సాక్షి ప్రతినిఽధి, మంచిర్యాల: క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో జిల్లా నాయకుల మధ్య దూషణల పర్వం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఎదుటనే మాజీ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత, గోమాసే శ్రీనివాస్ మధ్య పరస్పర మా టల యుద్ధం పార్టీలో అనైక్యతను బయటపెట్టింది. వేమనపల్లి మండలం నీల్వాయిలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా జిల్లా నాయకులు కింద కూర్చుని ఉన్నా రు. కింద కూర్చున్న వెంకటేశ్‌నేతను పక్కకు జరు గు అనే క్రమంలో ‘గోమాసే’ మొదట ఓ మాట తూ లాడు. ‘నన్నే అరేయ్ అంటావా.. చెంప పగులు త ది’ అంటూ వెంకటేశ్‌నేత ఆయనపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇందుకు ప్రతిగా ‘గోమాసే’.. ‘బట్టలూ డదీసి కొడతా’ అంటూ ఊగిపోయారు. ఇరువురు కాసేపు ఏయ్.. అంటే ఏయ్.. అనుకుంటూ పరస్పర దూషణలకు దిగారు. ఇరువురు కోపంతో ఉన్న క్రమంలో ఇంకా పరిస్థితి చేజారకుండా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు దుర్గం అశోక్, రజనీశ్‌జైన్‌తో సహా పలువురు వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే పరామర్శకు వెళ్లిన సమయంలో ముఖ్య నాయకులే ఇలా ఒకరిపై ఒకరు విచక్షణ కోల్పోయి నోరు జారడంపై అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నాయకులు అభాసుపాలయ్యారు. ‘గోమాసే’ గత లోక్‌సభ ఎ న్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలు కాగా, వెంకటేశ్ నేత ఎంపీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఇరువురికి లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే ఎంపీ టికె ట్ కోసం వైరం ఉండగా, ఈ ఘటనతో తాజాగా మరోసారి బయటపడినట్లయింది.