
సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చంద్ర య్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరా వు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి రైస్‌మిల్లర్లతో ల క్ష్యసాధనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, బ్యాంకు గ్యారంటీ, డిఫాల్టర్‌గా ఉన్న రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించబోమని స్పష్టం చేశారు.
కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: హాజీపూర్ మండలం కర్ణమామిడిలోని కేజీబీవీని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ రేషన్ సరుకులు, కూరగాయలు పంపించడం లేదని వెలువడిన కథనాల మేరకు స్పందించిన కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. వంటగదిలో రేషన్ సరుకులు, కూరగాయల నిల్వలపై ఆరా తీసి కాంట్రాక్టర్ గురించి తెలుసుకున్నారు. బిల్లులు ఖాతా లో జమ అయ్యాయని, దీంతో సరుకులు పంపించారని ఎస్వో స్వప్న కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తరగతి గదుల్లో బోధనను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. లక్సెట్టిపేటలోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు.