
కరెంట్ కనెక్షన్ ఇచ్చారు..
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘కరెంటు కనెక్షన్ లేదు’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మందమర్రి మండలం సారంగపూర్ గ్రామం శంకర్‌పల్లికి చెందిన రైతు జాడి పద్మ బోరు మోటారు కనెక్షన్ కోసం 2021 జూన్ 21న డీడీ చెల్లించింది. 2023లో విద్యుత్ ప్రజావేదికలో ఫిర్యాదుతో విద్యుత్ శాఖ సిబ్బంది స్తంభాలు వేసి వదిలేశారు. కరెంటు కనెక్షన్ కోసం కలెక్టరేట్, విద్యుత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ విషయమై కథనం ప్రచురితం కావడంతో సోమవారం విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు తీగలు లాగి, కనెక్షన్ ఇచ్చారు. దీంతో రైతు కుటుంబం ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

కరెంట్ కనెక్షన్ ఇచ్చారు..