
‘హామీల అమలుపై చేతెలెత్తేసిన కాంగ్రెస్’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించా రు. జిల్లా కేంద్రంలోని 43వ డివిజన్ రాంనగర్ ఏరియాలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో మేలు జరుగుతుందని ఓట్లు వేసి గెలిపిస్తే, ఆ హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.