
ఫైలేరియా వ్యాధి నిర్మూలిద్దాం
మంచిర్యాలటౌన్: జిల్లాలో ఫైలేరియా(బోదకాలు) వ్యాధిని పూర్తిగా నిర్మూలిద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రాళ్లపేట్‌లో ఫైలేరియా నియంత్రణపై టాస్–1 సర్వేను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఫైలేరియా నిర్ధారణకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాతమంచిర్యాల అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు శివప్రతాప్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, ఆరోగ్య కార్యకర్తలు సంతోశ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, శ్రీనివాస్, పాల్గొన్నారు.