
మారథాన్‌లో రాణిస్తున్న పద్మ
బెల్లంపల్లి: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు. ఆ విషయాన్ని గ్రహించిన బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సోమిశెట్టి పద్మ తన ఆరోగ్యంకోసం నడకను ప్రారంభించింది. క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే మారథాన్‌లో పోటీపడే స్థాయికి చేరుకుంది. గతేడాది హైదరాబాద్‌లో, కరీంనగర్‌లో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొని పట్టు సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న రాష్ట్ర సివిల్ సర్విస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 5కే ఈవెంట్‌లో పాల్గొని జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈ నెల 12న కరీంనగర్‌లో నిర్వహించిన హాప్ మారథాన్‌లో 21కేలో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించింది. 28 నిమిషాల్లో 5కేను పూర్తి చేసింది. గంట 4 నిమిషాల్లో 10 కేను, 2 గంటల 8 నిమిషాల్లో 21కే చేరుకుని నిర్వాహకుల ప్రశంసలు అందుకుంది.