
ఐటీడీఏ ఎదుట 72 గంటల నిరసన
ఉట్నూర్‌రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్‌సోర్సింగ్ వర్కర్లు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సోమవారం యూనియన్ జేఏసీ పిలుపు మేరకు ఐటీడీఏ కార్యాలయం ఎదుట 72 గంటలపాటు ని రసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తె లంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించడంతో పాటు టైంస్కేల్ వేతనాలు ఇవ్వాలని, కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, వారసత్వ ఉద్యోగాలు, త దితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు వెలిశాల కృష్ణమాచారి, టీఏజీఎస్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొడసం శంభు, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, తొడసం వసంత్‌రావు, అడ శ్యాంరావు, రాంబాయి, తదితరులు పాల్గొన్నారు.
నాయకుల అరెస్టుతో స్వల్ప ఉద్రిక్తత
ఉట్నూర్‌రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చేపట్టిన నిరసన రాత్రి వరకు కొనసాగింది. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సమస్య విన్నవించి వెళ్లాలని చెప్పినా యధావిధిగా కొనసాగించారు.. దీంతో పోలీసులు పలువురిని స్టేషన్‌కు తరలించగా నాలుగో తరగతి ఉద్యోగులు ఐటీడీఏ ద్వారం వద్ద ధర్నాకు దిగారు. తమ నాయకులను పోలీసులు విడిచి పెట్టడంతో శాంతించారు.